పుట:Abraham Lincoln (Telugu).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకరిపై బన్ను విధించు నధికార మాంగ్లేయుల కిచ్చినచో నందఱ కాకీడెప్పటికో యొకనాటికి దప్పదని తెలిసికొని, యాంగ్లేయులు భేదోపాయము ప్రయోగింప జూచినను, నాసీమ లెల్ల నొకకట్టుగ వారి నెదిర్చినిలచెను. ఆంగ్లేయు లెన్నియుపాయములు సేసినను సాగనందున యుద్ధమునకు సమకట్టిరి. ఆ సీమలవారును వెనుదీయక సమర మొనర్చిరి. తండోపతండములు సైన్యములుగొని యిరువాగులవారును దిక్కులు పిక్కటిల్ల జేయు భేరీ రవంబులతోడను నాయుధమనిన గజగజ నడుకు పిరికినైన సంపూర్ణోత్సుకు జేయు సింహ్మనాదంబులతోడను గదలి మాటిమాటి కొండొరులతో నొరసికొని జయాపజయంబుల గొనుచు బట్టణముల ముట్టడింపుచు, విడిపించుచు, దేశము నాక్రమించుచు, నాక్రమణ దేర్చుచు బలువిధముల బహుకాలము పెనగిరి. ఈపోరాటమున నాంగ్లేయులే యెక్కుడు దుర్దశలం గుడిచి తుట్టతుద కమెరికాజనుల దాడికోర్వలేక కొంతవఱకు వారిచే బట్టుబడి తమయధికారము నంతయు గోలుపోయిరి.

ఇట్లాంగ్లేయుల యధికారము నుండి దప్పించుకొని యీ సీమల వారు దామైకమత్యము గలిగి యేకరాష్ట్రముగ జేరకుండిన నితరుల మోర్చుట గష్టమనుట మనసునకు దెచ్చుకొని 'సంయుక్త' రాష్ట్ర మేర్పఱుప బూనిరి. సంయుక్తరాష్ట్రపు