పుట:Abraham Lincoln (Telugu).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని కిరువదిగురు పెనంగుటయు, నేరో యొక్క డేర్పడినతరువాత నితరులు పందొమ్మిదిగురు గారణము లేకయె దేశాధ్యక్షునిపై గోప మూనుటయు దటస్థించుచుండును. ఈ విషయముల నెల్ల గమనించి లింకను దనప్రభుత్వమున దప్పులేక నేరినిం దీయగూడదనియు, సమర్థులకు బ్రోత్సాహ మొసంగవలసిన దనియు గట్టుచేసి నడిపించెను.

రెండవమాఱు లింకను దేశాధ్యక్షత వహించుటె సంయోగసైన్యమునకు స్వాతంత్ర్యపక్షమున న్యాయపు గక్షకు నేబదిలక్షల సైనికుల జేర్చినంతటిబలం బొసంగెను. తిరుగుబాటుసీమల కంతకంతకు దూరమగుచుండిన జయఘటన దృష్టిపథంబున నుండియె తొలంగిపోయెను. వారికి బరాజయమే సంప్రాప్త మగుచువచ్చెను.

లింకను రెండవమా ఱధికారము పూనిన మూడువారములకు దేహారోగ్యము నిమిత్తమును దన 'కుఱ్ఱలకు' దగ్గర నుండు నిమిత్తమును సిట్టిపాయింటుకు దరలెను. అప్పుడ దానికి గొంచెము దూరమున మహా యుద్ధం బొండు జరిగె. తిరుగు బాటు సేన లోటువడి తమ యాధీనమందలి రిచ్మండు కోటలో దాగుకొనియె. సంయోగపు సేన లాపట్టణము ముట్టడించెను. సంగ్రామం బతియుగ్ర మయ్యెను. లింక నద్దానిని మిక్కిలి జాగరూకుడై గమనించి యుద్ధకార్యదర్శికి దెలియ జేయు