పుట:Abraham Lincoln (Telugu).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నే నిట నాపదమున గర్తవ్య విషయముల నొడివితిని. దీన జేసి సర్వజనులు స్వతంత్రు లై సమాను లై యుండవలెనను మదిచ్ఛ యెంతమాత్రమును మార్పు సెందలేదనుటను వ్యక్తపఱచుచున్నాడను."

ఇట్టినియమములకును నపేక్షలకును లోనై లింకను దాస్య విషయమును దఱిసి యయ్యాసురనిర్మాణమును నిర్మూలించి యదే కారణంబుగ నుద్భవించినయుద్ధమునకు రెండులక్షల నీగ్రోల (బానిస సిద్దీల) భటులుగ నియమించి యాదేశమందలి ప్రతి బానిసకును స్వతంత్రం బొసంగెను. ఇ ట్లొసంగుటయందును నతడు మిక్కిలి జాగరూకత సూపెను. సంయోగపు సైన్యములు 'దిరుగుబాటు' నణచునంతటి గొప్ప జయమందువఱకును దాను బానిసలపరమున జేయు నుత్తరువులు రిత్త యగునని గుర్తించి లింక నెందఱు దాస్యవిమోచనప్రకటనము సేయు మనినను జేయక తరుణము వేచియుండెను. ఆంటీటమను యుద్ధరంగమున దనసేనలు సంపూర్ణజయం బందె ననెడివార్త దిక్కు దిక్కునకు బర్వినతోడనె 1862 వ సంవత్సరము సెప్టంబరు నెల 22 వ దినమున లింక నెల్లర మనము రంజిల్ల జేయు దన విమోచన ప్రకటనపత్ర మమెరికా సీమలయం దన్నిట జదువ బడవలసినదిగ నేర్పఱచెను. 1863 వ సంవత్సర ప్రారంభమున నుండి దిరుగు బడిన సీమలయందలి దాసులెల్లరును స్వతంత్ర