పుట:Abraham Lincoln (Telugu).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్యాయస్వరూపుడనియు సౌజన్యమూర్తి యనియు బొగడ మఱొం డతని కార్యరాజంబులం గందురుగాత."

లింక నొకానొక స్నేతునకు వ్రాసినజాబు నొకదాని నిట బొందుపఱచెదము.

"ఏరైనను దాస్యమును నిలుపనిదే సంయోగము నిలుప జాలమనిరేని వారితో నే నేకీభవింపను.

"ఏరైనను దాస్యము దుదముట్టించనిదే సంయోగము నిలుపజాలమనిరేని వారితోను నే నేకీభవింపను.

"నాకు గర్తవ్యము సంయోగ సంరక్షణయేగాని దాస్య సంరక్షణగాని దాస్యసంహారముగాని కావు"

"ఒక్క దాసునినైన విముక్తుజేయక సంయోగము నిలుప గల్గుదునేని యట్లె చేయుదు. అందఱ విడిపించిన సంయోగము స్థిర మగునెడ నా త్రోవనె త్రొక్కుదును, కొందఱ విడిచిన గార్యము సరి యగునెడ నట్లె యొనరుతు.

"దాసులకై నే జేయు పనియెల్ల సంయోగము స్థిర పఱచుటకె. నాకెయ్య దీపనికి సహకారి గాదని నమ్మిక గలుగు నద్దాని బరిత్యజింతు.

"నాయందలి లోపముల జూపినపక్షమున నవి తప్పులేయైన దిద్దుకొనియెద. క్రొత్తమార్గముల దెల్పిన సరియగు మార్గము లైన వాని నంగీకరింతు.