పుట:Abraham Lincoln (Telugu).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టిది. అది ఘోరము గాదంటిరేని మఱి యే తప్పుప్రవర్తనయు ఘోరము గా జాలదు. నేను బానిసల నెప్పుడు గనినను, వారి దుర్దశం గుఱించి యెప్పుడు వినినను వారి స్థితినిగుఱించి యెప్పుడు దలపోసినను దాస్య మమానుషం బనుట నా మనసునకు వచ్చుచున్నది. అయిన నా దేశాధ్యక్షపదము నా యిచ్చచొప్పున నీవిషయమున దెగించి నాకు బనిసేయుటకు ననర్గళశక్తి నొసంగలేదనుటయు నే నెఱుగుదును.......... బానిసము మొదలుగా గల్గు చిన్నవిషయముల నిలపుటకై రాజ్యమును, రాజ్యపద్ధతులును, రాజ్యాంగమును నశింప జేసితినేని నేను నా ధర్మము జేసినవాడను గాజాలను....... జరుగు కార్యములకును వాన ఫలములకు నేను గర్తను గాను. అవియ నాకు గర్త లనిచెప్పనొప్పును. మూడుసంవత్సరముల యుద్ధమునకు బిదప నేడు మన రాష్ట్రపు స్థితిజూచిన నొక గక్షచేగాని మనుజునిచేగాని నిర్ణయింపబడినట్లు గనబడదు. దైవమ యిట్లు నడపుచున్నాడు. మనగతి యేమి యగుననుటయు విదితమ. ఈ గొప్ప యన్యాయ ప్రవర్తనంబును లోకమునుండి తుడిచివేయవలె ననియు నా యన్యాయమున కింతకాలము మన యుత్తరదక్షిణసీమలనుండు మనము ప్రోద్బల మిచ్చినందులకు దగువిధమున శిక్ష నొందవలె ననియు దైవము దలంచెనా నిష్పక్షపాతపురుషులు దేవుని