పుట:Abraham Lincoln (Telugu).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి దారిసూపినవా రమెరికనులు * దాని పరిపాకమును గనబఱచిన వారును వారె. లోకాద్భుతంబును లోకోపకారంబును నగువారికార్యము బానిసజాతిగ నేర్పఱుపబడి యున్న నీగ్రోల దాస్యమునుండి విముక్తుల జేయుటయ. అక్కార్యమునకు ముఖ్యకారకుడు లింకను. అతడు మొదట బానిసల జూచుటయు వారి స్థితినిగుఱించి దయార్ద్రహృదయంబున బిన్ననాటనె యుపన్యసించుటయు మన మెఱుగుదుము. అతడు గ్రమక్రమముగ వృద్ధినొందిన కాలమున గూడ సమయము దొరకినయెడల నెల్ల బానిసమును ఖండించుచు వచ్చుటయు మనకు దెలిసినవిషయమే ఆతడు దేశాధ్యక్షతవహించి స్వదేశోద్ధారకు డగుటయెగాక దాస్యజాతికి ముక్తిదాయకుడుగ నయ్యెను. రాష్ట్రపు సమ్యోగము నిలుప నెప్పుడు పాటుపడియెనో న్యాయపరిపాలనం బెప్పుడు దలపెట్టెనో యప్పుడు లింకను దాసుల వర వుడముల జెండాడ నిశ్చయింపవలసి వచ్చెను. అంతర్యుద్ధము మూడు సంవత్సరములు జరిగినతరువాత నతడు నిరంకుశసరణి నిర్భయముగ నిస్సంశయముగ నీరీతి బల్కెను:

"స్వభావమువలననే నేను దాస్యమునకు వైరిని. దాస్యము నిస్సందేహముగా భూమియందలి యన్యాయములలో మొద ______________________________________________________________

  • ఈవిషయమున నాంగ్లేయులును సమ్మానమందవలసినవారె. వారును నితరులకు స్వాతంత్ర్యము గలుగజేయ బాటుపడిరి.