పుట:Abraham Lincoln (Telugu).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

బానిసలకై పడినపాట్లు.

లోకములోన ననేకులు దమ జాతివారల, దమ మతము వారల దమ దేశీయుల నిడుమలనుండి విడిపించి మహా గౌరవం బందియున్నారు. గాని యితరజాతివారల నితరమతస్థుల దమకంటె హీనజన్ములుగ బరిగణింపబడువారల దమ దాసుల లేవనెత్తజూచినవారు గడు దక్కువ. గ్రీసు దేశమునందు బ్రజ లుత్తమ నాగరికమున నుండుతఱి నాగరిక స్వభావము దయ నంకురింపజేయ గొందఱు ప్రభువులు దమదాసుల బిడ్డలవలె బరిగణింపుచు వారికి సేచ్ఛనొసంగుచు వచ్చిరి. అయిన నది "మనుష్యులెల్లరు నొక్కటియ. అందఱు విశృంఖలలీల పనిచేసినంగాని లోకము సుఖంబున నుండదు. ఒకరికొకరు సాహాయ్యులు గావలసినదనియే గాని యొకరు మఱియొకరి యాత్మదేహముల రెంటింగొని తమ స్వలాభమున కుపయోగించుకొన గూడదనుట దైవికాజ్ఞా" యను జ్ఞానము వొడముటవలన జరుగుచు వచ్చినదిగాదు. అట్టి జ్ఞాన మంకురించి వృద్ధిపొందుట కారంభించినది పదు నెనిమిదియవ శతాబ్దమున గడపటి సంవత్సరములయందు.