పుట:Abraham Lincoln (Telugu).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారును గొంచెము వెనుదీసియు గొంత తడవునకు దేశాధ్యక్షుని చేయిగొన ముందు కేతెంచిరి. అయిన నందనేకులు లేవనేరని యంత దుర్భలు లయియుండిరి. కావున లింకను వారికడకేగి కై యొసగి "కుఱ్ఱలారా! ధైర్యము విడనాడ కుడి. ఉల్లాసమున నుండుడి. మా యోపినంత జాగ్రత్తతో మిము గాపాడెదము గాక. దైవము మీకు మేలుసేయును గాత" యని ప్రోత్సాహపఱచెను.

ఈ ప్రసంగము చూపరుల మనంబు నట్లె కొల్లగొనియెను. అచట నున్నవారల నొక్కరును గంటినీరు విడువని వారు లేరు. 'తిరుగుబాటు' సైనికుల ననేకులు గొల్లని యేడ్వసాగిరి. వారి కెప్పుడు నిట్టి యాదరణ దటస్థించునని వారు గలనైన దలపరైరిగదా!

ఇట్టి యుపకృతియెగదా లింక నొనరింప వేచియుండును!

కం. "ఉపకారికి నుపకారము
     విపరీతము గాదు చేయ వివరింపంగా
     నపకారికి నుపకారము
     నెప మెన్నక చేయువాదు నేర్పరి సుమతీ."

_______