పుట:Abraham Lincoln (Telugu).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞానచంద్రికాగ్రంథమాల.1

అమెరికాదేశాధ్యక్షుడగు

ఆబ్రహాము లింకను చరిత్ర.

(ఛాయాపటమును, 220 పుటలును గలది)

శాశ్వతపుచందాదారులకు అంచెకూలితో అణాలు 8.

ఇతరులకు అంచెకూలి కాక అణాలు 12.

విజ్ఞానచంద్రికాగ్రంథమాలలో బ్రచురింపబడు గ్రంథములన్నియు గొనుటకు నొప్పుకొనువారు శాశ్వితపుచందాదారులుగ నెంచబడుదురు. వారి కీమాలలోని గ్రంథములన్నియు నంచెకూలితో నూఱుపుటములకు ర్పు. 0-4-0 చొ|| నివ్వబడును. అట్లుచందాదారుల కా దలచినవారు ప్రవేశరుసుము క్రింద ర్పు. 0-2-0 చీట్లు పంపుచు నీ క్రిందిప్రకారము విజ్ఞానచంద్రికామండలికార్యదర్శి గారికి నుత్తరము వ్రాసికొనవలయును.

మ.రా.రా.శ్రీ, రావిచెట్టి-రంగారావుగారికి,

రెసిడెన్‌సీ బాజారు, హైదరాబాద్ (డెక్కన్)

అయ్యా,

విజ్ఞానచంద్రికామండలి ప్రచురించుపుస్తకములు కొన గోరుచున్నాను. కావున నన్ను దమశాశ్వితపుచందాదారుల నొక్కనిగ గొని ప్రతిగ్రంథమును వి.పి.మూలమున బంపుచుండవలెనని ప్రార్థించు చున్నాను. ప్రవేశరుసుముక్రింద నిందుతో రెండణాలచీట్లు పంపినాను.

పేరు ..................

గ్రామము ...............

తపాలాపీసు ..............

జిల్లా ...................

ఈ గ్రంథమాలలో బ్రచురించిన గ్రంథములనుగుఱించి తమయభిప్రాయము దెల్ప గోరువారును, మాలలో బ్రచురించుటకు గ్రంథముల వ్రాయదలచినవారును మాలా సంపాదకులలో నొక్కరగు జి. హరి సర్వోత్తమరావు, బీ.ఏ., ట్రెయినింగ్ కాలేజ్, తాజమంద్రి యనుపేరిట నుత్తరప్రత్యుత్తరంబులు సలుపవలెను.