పుట:Abraham Lincoln (Telugu).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడిచిపోను. నా 'కుఱ్ఱలు' నను జూడకున్న మిక్కిలి యసంతుష్ట హృదయ లగుదురని" లింకను మరలబోయి నిలువయున్న భటుల నాదరించి మనస్సంతోషమున బలుగంటల మీద నింటికి దరలెను.

యుద్ధమున నెచటనేని యనేకులు హతులై రని లింకను వినిన మిక్కిలి కుందు. "ఘోరము, ఘోరమ"ని పలుకుచు బలుమాఱు భోజనాధులపై దృష్టియే సారింపకుండు. జయ వార్తలు వచ్చిన నితరులు దను బొగడిన దాను యుద్ధభటుల చేతన యాజయం బొదవెనని వారిని గొనియాడు. వారిపై నెల్లప్పుడు బ్రాణము లుంచుకొని వారి కేహాని వచ్చినను దానె యనుభవించినట్లు దు:ఖించుచు గొంత తనదేహ దార్ఢ్యముగూడ గోలుపోవుచుండు. సైనికుల త్యాగంబున కతడు మిక్కిలి యలరి వా రొక విధమున దనకంటె గొప్పవారని తలంచు. అ ట్లగుట వారి సౌఖ్యాభివృద్ధికి జేయబడు ప్రయత్నములనెల్ల నత డామోదించుచుండును.

సైనికులకు సాయ మొనర్ప ద్రవ్యము సేర్చుటకు గొన్ని గొప్ప సంతలు జరుపబడియెను. అచ్చోటులనెల్ల లింక నగ్రస్థానము వహించుచువచ్చెను. ఫిలడెల్పియా పట్టణమున జరిగిన సంతలో 50 లక్షల డాలర్లు దొరకె నని విని లింకను "దేశాభిమానమునను న్యూగిన్‌దేశమునుబోలిన దేశము