పుట:Abraham Lincoln (Telugu).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ప్రభూ! లింకను. నేను రాజ్యాంగమునకు వ్యతిరేకముగ బోరాడిన తప్పిదమునకై క్షమింపుమని వేడ జాలకాలము వేచియున్నాడ"నని కన్నీరుగార్చుచు బల్కెను.

లింకను వాని యునికికి వ్యసనపడి ప్రత్యశ్రువులు వ్రాల్చి వాని మన్నించి యభయహస్తంబిచ్చి సంతసింపజేసెను. ఇట నాతడు దనకు లోబడిన శత్రువుల క్షమింప జేసిన యుత్తరవు స్మరణకు వచ్చుచున్నది. "తన దుష్ప్రవర్తన కెవ్వడు పరిపూర్ణమనమున బరితపించి దానిం దగువిధమున గనుపఱచునో వాని నిర్భయముగ క్షమింపవచ్చును. అట్టివా రేరైనను సరియె. భిన్నాభిప్రాయము వలదు." ఈకడపటి మాటలనేక యుపన్యాసములకంటె స్ఫుటముగ క్షమాపరిపాకంబుం బ్రకటింపవే!

వైద్యశాల చుట్టుం దిరిగి పనిముగిసె ననుకొని లింక నా సీనుడై యుండెను. అప్పు డాశాలయం దొక్కభాగమునకు వారు పోలేదనియు, నచ్చటి 'కుఱ్ఱలు' లింకనును జూడ గోరెద రనియు దెలియనాయెను. అంత నావైద్యు డతని జూచి,

"మీరు మిక్కిలియలసితిరి. నేనును డస్సితిని. పోకున్నను దొందరలేదు. మీరు వెడలకు డ"నియెను. "నేను వెడలియే తీరవలెను. నాకు దెలియునంతవఱ కొక్కనినైనను