పుట:Abraham Lincoln (Telugu).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బర్తను దలదీయ నిశ్చయించిరని చెప్పి యాకఠినశిక్ష మాన్పి తనకు పతిభిక్ష నిడవలె నని వేడెను. వెంటనే దేశాధ్యక్షుడు మన్ననపత్ర మొకటి వ్రాసి యామె కిచ్చి తగు నధికారుల యొద్దకు బోవ నియమించి యామెభర్తను గాపాడెను.

కృశించి సన్నగిల్లి వికారకారుడగు నొకపిల్లకాయ దేశాధ్యక్షుని జూడవచ్చిన గుంపులో నిల్చియుండెను. వాని జూచి, "నాయనా! నీకేమి కావలయు"నని లింక నడిగెను. "ప్రభూ! మీ పటాలములలో నొకదానియందు నేను రెండేండ్లు నగారా వాయించుచుంటిని. కర్నల్ కొకనాడు నాపై నాగ్రహమువచ్చి నన్ను దఱిమి వేసెను. రోగపీడితుడనై యౌషధశాల జేరి చాలకాల మైనతరువాత, స్వస్థతజెంది మరల మీకృపాకటాక్షములపాలుగా నిట్లు వచ్చితి" ననెను. అది విని వానిస్థితిగతుల విచారించి, బంధుమిత్రాదు లెవ్వరును లేక యేకాకియై పనిచేయు దార్ఢ్యములేని యాదిక్కుమాలిన మానిసి వృత్తాంతమునకు జాలిగొని, కండ్ల నీళ్లు నించి మాటలాడ నోరాడక యొక కాగితముపై "నీబాలుని జాగ్రత్తగ గాపాడు డ"ని వ్రాసి తగునధికారులయొద్దకు బంపి యా బాలుని సంతసింపజేసెను.

వాషింగ్టన్ పురవాసి యొక్క డీకథ జెప్పుచున్నాడు: ఒకనాడు నే దేశాధ్యక్షుని జూచుటకు బోయియుంటిని. అప్పు