పుట:Abraham Lincoln (Telugu).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మింపగలరు. ఇందుకు దార్కాణంబుగ మ.రా.రా.శ్రీ, కొక్కొండ వేంకటరత్నముపంతులుగారిచే రచియింపబడిన 'శ్రీ ఫ్రిన్సపువేల్సు హిందూస్థానసందర్శన మ'ను గ్రంథము జూడనగు. అందు 'నాంగ్లరాజనీతి' (British constitution) యొక్క సంగ్రహవర్ణనయు, బేకన్, షేక్స్‌పియర్ మొదలయిన యాంగ్లవిద్వత్కవులయొక్క వాక్యంబులకు సరియైన తెలుంగును, దేశాటనమువలన గల్గులాభములవర్ణనయు జూచిన, మన పూర్వపండితులు కొందఱు నిజముగ శబ్దసృష్టికి నీశ్వరు లని చెప్పవలసియున్నది. కాన నింగ్లీషు విద్యావిభూషితు లిట్టి పూర్వపండితులసామర్థ్యంబును వ్యర్థముగ పోనీయక తమగ్రంథనిర్మాణంబునకు వారి సహాయంబు గొనుదురు గాక. పూర్వపండితులును మావంటి యింగ్లీషు నేర్చినవారు వ్రాసెడి నూతనాంధ్రగ్రంథంబుల నసూయతో జూడక యందలిలోపముల జూపి యిట్లు దిద్ధుకొనుడని తెలిపి మార్గదర్శకు లగుటకు బ్రార్థితులు. ఇట్లు పౌర్వాత్యపాశ్చాత్యపాండిత్యసమ్మేళనమువలన మనభాషకు నుభయవిద్యలలోని చక్కదనము రాగలదు.

ఇట్లు

సకలయాంధ్రజనులకు విన్నవించు

విజ్ఞానచంద్రికాసభాసదులు

బుధవిధేయులు,

నాయని వెంకటరంగారావు,

మునగాల జమీన్దారు.

రావిచెట్టి రంగారావు,

మన్‌సబ్దారు, హైదరాబాదు.

కే.వి.లక్ష్మణరావు, ఎం.ఏ,

మునగాల దివాను.

జి.హరిసర్వోత్తమరావు, బీ.ఏ.,

అయ్యదేవర కాళేశ్వరరావు, బీ.ఏ.భీ.ఎల్.