పుట:Abraham Lincoln (Telugu).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకులు స్వదేశాభిమానులు నా పక్షమున నుండ నా కేమియు లోపము గలుగద"ని దీర్ఘాలోచన పరత్వమున దన మనో నైర్మల్యంబును గనుబఱచుచు నుడివెను. దురభిమాన మతని కెప్పుడును లేదు. జనులలో మెలగి వారి యభిప్రాయముల నెఱింగికొని యనుభవముచే జ్ఞానము సంపాదింపకున్న దనశక్తివల్లన జయమందలే నని యతడు చక్కగ గ్రహించెను. సర్వజనానుకూలం బగునారాజ్యాంగముపై దన దేశీయు లందఱకు ననురాగము గలదనియు, నవినీతు లొక్కరిద్దఱెంత పాటువడినను జయమందజాలరనియు గట్టిగ నమ్మియుండెను. ఇట్లు జనుల నాదరించి కించిత్తైన ననుమానభయములు లేక వారిం దనవారిగ బ్రథమమునుండి జేకొనుటయె యట్టి మహోపద్రవకాలమున గర్తవ్యాంశమని యతడు గని పెట్టుట మిక్కిలిశ్లాఘనీయము. కొంచె మటునిటు గొంకు వాడయి యుండిన నాపదవి కత డనర్హు డయి యుండును.

గతప్రకరణమున యునైటెడ్ స్టేట్సులో మూడుకక్ష లుండె నని చెప్పితిమి. అందు లింకను రిపబ్లి కను గక్షకు జేరినవాడు. దానితో ననేక విషయముల నంగీకరించునది మఱియొండు కక్ష గలదు. అందు ప్రముఖుడు డగ్లసను నత డుండెను. అతనితో ననేకపర్యాయములు లింకను పోరాడి జయ మందియుండెను. అయిన దేశోద్ధారణ కార్యమునకై డగ్లసు