పుట:Abraham Lincoln (Telugu).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్ర (History)విషయమునందును, తత్వజ్ఞాన (Philosophy) విషయమునందును బట్టపరీక్షలలో గృతార్థులయి, Geology (భూగర్భశాస్త్రము), Biology (జీవశాస్త్రము లేక చేతనశాస్త్రము), Zoology (ప్రాణిశాస్త్రము లేక జంతుశాస్త్రము) అను ప్రకృతిశాస్త్రములపేళ్లైనను విన నట్టి బీ.ఏ.,ఎం.ఏ.,పదవి నందినవారల మన మెందఱిని జూచుట లేదు? ఇట్టి వారీశాస్త్రముల నితరగ్రంథముల దెలుగున నేల చదువగూడదు? ప్రవేశపరీక్ష మొదలయినపరీక్షలకు జదివినవారికి నిట్టిగ్రంథము లర్థమే కానేరవు. కాన వీ రిట్టిగ్రంథంబులు తెలుగున నేల చదువగూడదు?

తా మన్నివిషయములలో నిధులయి తమ కిట్టిపుస్తకములతో బ్రయోజనము లేక పోయినను ఇంగ్లీషు విద్యావిశారదు లిట్టియాంధ్రగ్రంథంబుల గొని, యట్టిగ్రంథంబు లెక్కుడుగ వెలువడునటుల జేయుట వారికి పరమధర్మము. ఎందు కన నిట్టిపరిశ్రమను నభినందించు విజ్ఞానము వారికి గలదు. విజ్ఞానము గలవా రజ్ఞానులవలె బ్రవర్తించుట పాడియె?

ఇదియుగాక మేము వ్రాయుగ్రంథములు జనసామాన్యంబుకొఱకైనను నేడు జనసామాన్యం బీగ్రంథంబుల గౌరవము దెలిసికొనలేనందున నింగ్లీషు నేర్చినయుభయభాషావిదులే యిట్టిగ్రంథంబుల గొని ప్రచురించు వారి బ్రోత్సాహపఱచుచు, జనసామాన్యంబుల కాగ్రంథంబులలోని విషయముల దెలుపుచు, నాగ్రంథంబులు జనులకు బ్రియంబు లగునటుల జేసి వారికి మార్గదర్శకు లగుచుండవలెను. అటుల జేయకునికి మాతృభాషాద్రోహ మనిపించుకొనును.

కేవల సంస్కృతమునందుగాని, కేవ లాంధ్రంబునందుగాని పాండిత్యము గలవారుగూడ మాకు సాయ మొనర్పవలసి యున్నది. క్రొత్త యింగ్లీషుపదములకు సమానార్థకములయిన సంస్కృతపదములుగాని, ఆంధ్రపదములుగాని సేకరించి యియ్య గల్గుశక్తి వీరిక కలదు. నూతనకల్పనల (New ----) మనము వారికి దెల్పిన వారు సొగసైన యాంధ్రపదముల