పుట:Abraham Lincoln (Telugu).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాలదు. రోమక రాజ్యమును మహోన్నతపదవికి దెచ్చి లోకమునందలి నాయకశిఖామణుల శ్రేష్ఠుడని పేరు వడసిన సీజరునకంటె లింకను గొప్పవాడని యొకానొక పెద్దసభ యందు నుడువబడియెననిన మన కిక్కార్యముల నిశ్చయపరిమాణము స్ఫురింపగలదు. ఇంత మహాద్భుతవ్యాపకము గల విషయముల జర్చించుటలో లింకను స్వభావము సంపూర్ణముగ బయలుపడక పోవచ్చును. గొప్ప రాష్ట్రాధిపతియై కోట్లతో నెన్నదగు బ్రజల బరిపాలించుచు నతడు సర్వ సాధారణకార్యముల నెట్లు మెలగెనో విశదీకరించిన నతని గొప్పతనమునకు దారిసూపిన గుణపుంజములు దెల్లము గా గలవు. ఉపన్యాస సహస్రములకంటె గొన్నియుదాహరణము లాతని సామర్థ్యము, న్యాయబుద్ధి, దేశభక్తి, ప్రయత్నశక్తి, దయాళుత్వము, స్వబలసాహాయ్యపరత్వము, మనోదార్ఢ్యము, చాతుర్యము, వివేచన, ప్రతిభ, యౌదార్యము, ప్రాబల్యము మున్నగువాని జక్కగ జూపగలవు. ఈకారణము బట్టి "సిత గృహము" *[1]న లింకను గడపిన సంవత్సరముల నాతని చరిత్ర యందలి బోధకవిషయముల నెత్తివ్రాయుచు వచ్చెదము.

  1. * అమెరికాదేశమందలి సంయుక్త రాష్ట్రముయొక్క రాజధాని యగు వాషింగ్‌టన్ పట్టణములో దేశాధ్యక్షు లుండుటకు నిర్మింపబడిన రాజ మందిరముకు "సితగృహ" మని పేరు.