పుట:Abraham Lincoln (Telugu).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థించుచు నొక గిన్నెడు తేటనీళ్లు స్వీకరించెను. * సమయానుగుణముగ దన యభిప్రాయముల లింకను మార్చుకొనునని జను లనుకొనిరి గాని యత డెప్పుడును మంచిమార్గము వదలడాయెను. లింకను బానిసంబు నెంత బలముగ నెదిరించు ద్రాగుటను నంతియ బలమున ఖండించును. జనులు దేశాధ్యక్షుడు గౌరవార్థము ద్రాగుట ముఖ్యమని తలంచి యుండినను లింకను దనకార్యములచే నట్టిదాన గౌరవము లేదనియు దేవు డిచ్చిన స్వచ్ఛోదకమునకంటె బలిష్ఠమగు పానీయంబు మఱొండు లేదనియు బహిరంగముగ జాటెను.

లింకను పేర్కొనబడియె ననువార్త పర్వగానే బద్ధ సీమలయం దుద్భవించిన రోషజ్వాలలు నింగిముట్టెను. సంయోగమునుండి వీడిపోయెదమని కొన్నిసీమలు జంకించెను. నవంబరు నెలలో లింకను నిర్వాచకులచే నేమింపబడునప్పటికి దక్షిణ సీమలేడు దాము మిక్కిలి పనిచేసి యొక నూతనసంఘ మేర్పఱచుకొని రాబోవు మహోత్పాతముల సూచించు గొఱకొఱలు వినిపించెను.

కడుదూరమున శాత్రవజలదములు గుమిగూడుచుండెను. వాని యుఱుములును గొంచెముగా విననాయెను. నెమ్మది ______________________________________________________________

  • మనము మంత్రాక్షతల గైకొని యాశీర్వదించు తెఱగున బాశ్చాత్యు లేదేని యొక పానీయముం బుచ్చుకొనుచు నాశీర్వదింతురు. ఆశీస్సు నందు వారు మనయందువలె సమ్ముఖమున నుండవలెనను నిర్భంధము లేదు.