పుట:Abraham Lincoln (Telugu).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనెను. హానా దు:ఖము నిర్వచనీయ మాయె. తన కుమారుడు దుర్మార్గమున నిట్టి యిక్కట్టుల బడి దండనీయుడు గావలసెనే యను చింతచే నేమియు జేయ దోపక భ్రమ జెంది కొంతసేపటికి దెప్పిఱిలి "గురుగుణు డాబి" మనసునకు దట్ట నత డేమేని సాయ మొనర్చు నని నిశ్చయించుకొని లింకనుకు మొఱ వెట్టుచు దన పుత్రు రక్షింపవలసిన దని వేడుచు వార్త బంపెను. లింక నాజాబు జూచినతోడనె చక్షువుల నుదకములు వ్రాల్చి తనకృతజ్ఞాత జూపుట కదియ సమయ మనుకొని, హానాకై యామె బిడ్డ నెంతకష్టముల కోర్చియైన గాపాడ గంకణము గట్టెను. శక్తికొలది పాటుపడుదుననియు దైవానుగ్రహముండిన మేలు గాగలదనియు దక్షణ మాపె స్ప్రింగుఫీల్డుకు రావలసిన దనియు హానాకు బ్రత్యుత్తరము వ్రాసెను.

ఆమె కా వాగ్దాన మాకాశవాణి దోడ్పడ నెంచి పల్కినట్లగుపడెను. పగులు స్థితియందుండు గుండె ధైర్యము గొన నామె సత్వరముగ స్ప్రింగుఫీల్డుకు వచ్చిచేరి లింకనున కున్నవిషయముల వెల్లడి పఱచెను. కొందఱు వయోవంతులు హాలారస పానమత్తులై హాస్యానుకూల ప్రసంగంబుల కారంభించి తన్తూలంబున వివాదంబులకు గడగి రోషానలారుణితలోచను ---------సింధురంబుల తెఱంగున మై మఱచి యొండొ