పుట:Abraham Lincoln (Telugu).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అమ్మా, నీ హక్కు స్థాపించుట కావంతయైన నాధారము గానరా దనుటకు జింతిల్లుచున్నా" ననెను.

ఆమె మిక్కిలి చిన్నవోయి "అదెట్ల"ని విచారించెను.

అంత లింకను విషయములనెల్ల నామెకు జక్కగ విశదీకరింప నామె లేచిపోవ నుద్యమించెను. లింకను "నిలునిలు" మనుచు దన కోటు జేబులోనుండి యామె యిచ్చిన చీటి దీసియిచ్చెను.

ఆమె వెఱగంది "మీ రద్దాని సంపాదించితిరి. అది మీదె యగు" ననెను.

"కాదు, కాదు, అది సరికాదు. నా ధర్మము నే జేసితిని. నే నేమియు గ్రహింప" నని గట్టిగ బల్కి యామె దాని గొని పోవునట్లు చేసెను.

లింకను బాల్యమున "పిన్ని హానా" యను నామె యతనియెడ బ్రేమ గలిగి యుడుపుల శుభ్రపఱచి యిచ్చుచు భుజించుట కప్పుడప్పు డేమైన నొసగుచుండెను. అందుకు బ్రతికృతిగ లింక నామె కుమారుని యుయ్యెల నూపుచుండెను.

ఇప్పటి కా శిశువుతండ్రి పరలోకప్రాప్తి జెందియుండెను. ఆ శిశువు దరుణవయస్కు డై పోరాని పోకల బోవుచుండెను. అట్లు మెలగుచు నొక్కతఱి హత్యనేరమున జిక్కు