పుట:Abraham Lincoln (Telugu).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి యాసురకృత్యమును నిరాకరింపజాలని చట్టముల హీనత్వంబునకు మిక్కిలి కనలి లేచి నిలిచి తన నిడుపుచేతుల నాకాశమార్గంబునకు బఱపి,

"దైవానుగ్రహం బుండిన నా నీగ్రో నిప్పుడ రక్షించెద. లేకున్న గవర్నరు కిట్టివిషయముల నిష్టానుసారముగ బ్రవర్తింప నధికార మిచ్చువఱ కిరువదిసంవత్సరములైన జట్ట నిర్మాణసభయందు బోరాడి యల్లకల్లోలం బొనర్చెద" ననియెను.

వెంటనే లింకను హెరన్డనులు దమ ధనము న్యూఆర్లియన్సుకు బంపి యా నీగ్రోను విడిపించిరి.

లింక నొకతఱి చిక్కుల కిక్క యగు నొక వ్యాజ్యములో వాదించుచు దాను దప్పుపక్షమున నుంట బొడగాంచెను. కక్షిదారుడు దుర్నీతుడై యతని కబద్ధము సెప్పి యుండెను. అతడు శ్రమ జేసి తన కక్షిదారుకై యొక యప్పు లెక్కను సిద్ధాంతపఱచెను. అయిన బ్రతికక్షివా రా లెక్క కెల్ల విరుద్ధముగ జెల్లుచీటి (రశీదు) నొకదాని గనుపఱచిరి. దీనివిషయము లింకనున కెఱుకయే లేదు. ఎదురు న్యాయవాది దన వాదము ముగించుటకుమున్నె లింకను న్యాయస్థలము నుండి లేచిపోయి యుండెను. దాని గాంచి న్యాయాధికారి యతని బిలువ నంపెను. అయిన లింకను నేను రాజాల