పుట:Abraham Lincoln (Telugu).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకనాటి మధ్యాహ్న కాలమున లింకను హెరండనుల యుద్యోగస్థలమున కొకముసలి నీగ్రో (సిద్దీ) స్త్రీ యేతెంచి తన విషయమెల్ల సాంతముగ జెప్పుకొనెను. అంతకుబూర్వ మాపె గెంటకీ సీమయందు హిన్కె లను నతని బానిసగా నుండెను. అతడు దయా మయత్వంబున నామెను బిడ్డలను నిల్లినాయి సీమకు దెచ్చి స్వేచ్ఛ యొసగి యుండెను. అప్పుడామె కుమారుడు న్యూఆర్లియన్సుకు బోయి యుండి యవివేకి యై గ్రామము సొచ్చెను. ఇతరసీమలనుండి వచ్చు ముక్త బానిసల బట్టి మరల దాస్యమున కమ్మవచ్చు నను 'సీమ' చట్టము ననుసరించి పోలీసువా రతని బట్టి యుంచిరి. వెంటనే మరల్చుకొని రాకున్న ద్వరలోనే మరల నతనికి దాస్యము సంభవించిన ట్లుండెను. అట్టి యాపదనుండి తన పుత్రు దప్పించరే యని యామె వేడెను. లింక నార్ద్రహృదయత్వము వెల్లివిరియ జొచ్చెను. కఠినచట్టములపై నాగ్రహమును మెండయ్యెను.

హెరవ్డను నవలోకించి "రాజకీయోద్యోగస్థలమునకు బరువిడి యీ నీగ్రోను రక్షింప గవర్నరు చిస్సెలుగా రేమైన జేయగలుగుదురేమో తెలిసికొని రమ్మ"నెను.

ఆ యాలోచన నిష్ఫల మాయెను. గవర్నరు దన కా విషయమున నెట్టి యధికారమును లేదని వార్త బంపెను.