పుట:Abraham Lincoln (Telugu).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సొంపుగాని దినముల నద్దాని నుపయోగించు కొనుచుండెను. ఇంతటిమితపరికరములు గలవా డైనను అతని రాకమాత్రము భూస్వాములకును న్యాయవాదులకును మోదప్రదం బయి యుండెను.

న్యాయవాదిగ నున్నెడ నతడు నిష్కాపట్యము, నిష్పక్షపాతము, న్యాయవాంఛ, దయ, ధారాళత్వముల జూపి ప్రసిద్ధి వడసెను. ఈ గుణముల సూచించు దృష్టాంతముల లిఖించి యొక గ్రంథము నింప నగును. అయిన నిచ్చట గొన్నిటి మాత్ర పొందుపఱచెదము.

లింకనువద్ద కొక వ్యాజ్యకా డేతెంచి తన కథనెల్ల జెప్పుకొనియెను. చక్కగ విని,

"నీకు నే నుపయుక్తుడ గాజాల. నీ వ్యాజ్య మనృత" మనియెను.

"అదంతయు మీ పనిగాదు. నే డబ్బిచ్చి మిము నాపరము వాదింప నునిచికొనిన సరిగదా" యని వాడు ప్రతిపల్కెను.

"నేనట్లు వాదింపను. న్యాయవాదిగ నుండుట యన్యాయమును న్యాయ మొనర్ప గడగుట కాదు. నిస్సంశయముగ దప్పుత్రోవల ద్రొక్కువ్యాజ్యమే నెన్నటికిని నంగీకరింపను."

"నా వెరిని మీరు దొందరల బెట్టవచ్చును గాదా?"