పుట:Abraham Lincoln (Telugu).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామర్థ్యముతో న్యాయముకొఱకు బెనగువా డని దేశమునం దంతయు గీర్తిప్రఖ్యాతుల వడసెను.

1837 వ సంవత్సరమున లింకను న్యాయవాది యాయెను. ఆవృత్తియం దతడు సూపిన బుద్ధిచాతుర్యములును అతడు గడించిన కీర్తిప్రసిద్ధులును ముందు ప్రకరణమున వర్ణింప బడెడిని.

చట్టనర్మాణసభకు నతడు మఱి రెండుమారులు 1838-1840 లలో జయపరంపరలతో నియమింపబడెను. 1840 వ సంవత్సరము నియమింపబడినపు డా సభలో వాబాషుసీమ ప్రతినిధి యొకడు విధానలోపములని యనేక గష్టముల దెచ్చుచుండును. అందఱు నతని నణపలేక వెనుకముందు ద్రొక్కుచుందురు. లింకనునియామకులకు సంబంధించిన యొకానొక విషయము చర్చింపబడుచుండెను. వాబాషు ప్రతినిధి వెంటనే లేచి యిది విధానలోపకలితమని ఖండింప బ్రారంభించెను. దానికి బ్రత్యుత్తరముగ లింకను లేచి యీ ప్రకారము చెప్పదొడగెను.

"సభాద్యక్షా! ఈప్రతినిధిగారి యాక్షేపణవినిన నా పూర్వస్నేహితు డొక్కరుడు జ్ఞప్తికి వచ్చుచున్నాడు. అతడు వింతచూపుల ముసలివాడు. కనుబొమలు మిక్కిలి దట్టములై కనుల నావరించికొన జూచుచుండును. వాని క్రింద