పుట:Abraham Lincoln (Telugu).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఒక్క డాలరు పాదరక్షలకై పాటుపడుచున్నా"నని ప్రత్యుత్తర మిచ్చుచు జలిచే రాయిగట్టిన పాదముల జూపెను.

అంత నాబ్రహాము "ఆ గొడ్డలి నిటందిమ్ము. వెచ్చగ నుండుచోటికి బోయి చలికాచుకొని రమ్మ"ని వాని బంపివేసి త్వరితగతి నా యింటినంతయు క్షణములో గొట్టిపెట్టెను. ఆ యింటి యజమానుడును ట్రెంటును ఈతని శక్తి కాశ్చర్యముం బొందిరి.

ఇక నిట్టివిషయము లెన్నియైన జెప్పవచ్చును. అయిన గ్రంథవిస్తరభీతిచే జెప్పనొల్ల.

1833 వ సంవత్సర మాబ్రహాము న్యూసేలము పోస్టు మాస్టరుగ నియమింపబడెను.. ఆ పట్టణమున నతనికంటె నెక్కుడు తగినవారు గానరానందున నతనికే యాపని నిచ్చిరి. అచ్చటను నతడు దన సౌజన్యము గనుపఱచెను. చదువు రానివారలకెల్ల నుత్తరముల జదివిచెప్పుటయు, ననేకులను సభగ జేర్చి వారికి వార్తాపత్రికల బిగ్గరగ జదివి వినిపించుటయు నతనికి మిక్కిలి సహజములాయెను. అతడు వచ్చిన యుత్తరముల దనటోపిలో నుంచుకొని తా బయలు వెడలునప్పుడు పంచి పెట్టుచుండెననికూడ గొందఱు చెప్పుచున్నారు.

చట్టనిర్మాణ సభయందు బ్రతినిధులు రెండుసంవత్సరముల కొకమాఱు నియమింప బడు చుందురు. కావున 1834 వ