పుట:Abraham Lincoln (Telugu).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతకాలమునకు దరువాత హటాత్తుగ నొకనా డతడు జాన్ కాట్‌హానను భూములు కొలుచువానిని (సరవేయరును) గలసెను. అత డాబ్రహామును గొల్తపనికి (సరవేపనికి) బూనుమని ప్రోత్సాహపఱచెను. కొంత యోచించి యాబ్రహా మతనిదగ్గర నాఱువారములలో బనినంతయు నేర్చుకొనెను. అతడు సేయగల్గినంతపనియు దాని కనుగుణమగు జీతమును రా బ్రారంభించెను. ఆపనియం దతడు సంపాదించిన బ్రావీణ్యమున నెట్టివివాదములు వచ్చిన నతనిని మధ్యస్థిగ బిలుచు చుందురు. ఎచ్చట నున్నను సింగపుబుడుత సింగపుబుడుతయే గదా.

తనకు దీఱికయున్నపుడంతయు నాబ్రహా మితరుల కుపకార మొనరించుచుండును. దురదృష్టము పాలబడిన వారికిని. కష్టముల గుడుచువారికి, బీదసాదలకును నతడు సాయ మొసంగ బ్రయత్నించుట రానురాను వృద్ధిపొందుచు వచ్చెను.

చలి దట్టముగ గ్రమ్మినకాలమున నొకనా డాబ్‌ట్రెం ఱనువాడు హిల్లనునతనికై పాడుపడిన యొకకొయ్యయింటిని గట్టెల నిమిత్తము గొట్టి యిచ్చుచుండెను. ట్రెంటు పాదరక్షలు లేక చలిలో గడగడ వడకుచుండెను.

దాని జూచి 'ఈపనికి నీ కేమికూలి' యని యాబ్రహా అడిగెను.