పుట:Abraham Lincoln (Telugu).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనిన విధమున గొప్పతనమునకు నిగర్వమే యానవాలు గదా? కావుననే లింక నితరుల దృష్టికి దా గనుపడినంత శక్తిసామర్థ్యములు గలవాడుగ దనకంటి కగుపడ కుండెను.

కమ్మరి యగుట మాని యాబ్రహాము వ్యాపారి యాయెను. బెఱ్ఱియను వానితో జేరి యొక యంగడి నడపసాగెను. అయిన బెఱ్ఱి జ్ఞానహీనుడై త్రాగుబోతుతనమున నప్పుల కుప్పయై నష్టముల దెచ్చిపెట్టి దివాలా యెత్తెను. అతని దివాలతో నంగడి ముగిసి పోయెను. గొప్ప యప్పుమాత్రము నిలిచెను. గ్రీనువద్ద గొంతధనము పుచ్చుకొని యాబ్రహా మాయప్పును దీర్చివేసెను. తా న్యాయవాది యైన తరువాత గ్రీనుకు గడపటి కాసుతో జెల్లించెను.

దుకాణ మదృశ్య మగుడు నుద్యోగహీనత్వ మాబ్రహామున కాసన్నమాయెను. పనిలేనికాలమున నత డనేక గ్రంథముల బఠించెను. అందు 'పూర్వకాలపు జరిత్రము,' 'రోమక రాజ్యప్రవృద్ధినాశములు' మొదలగునవి సర్వోత్తమములు. అతడు చదివిన విషయముల నన్నిటిని సంగ్రహముగ వ్రాసియుంచుకొనును. తరువాత వానిని సులభముగ శిరోపేటిక జేర్చుచుండును. అతనికి జిక్కులు విడదీసి యుదాహరణ బాహుళ్యము సూపి మనోరంజకముగ నుపన్యసించు శక్తి నొసంగిన దిదియ గాబోలును.