పుట:Abraham Lincoln (Telugu).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణములుగూడ గలవు. అతనివిగ్రహమే యంతసుందర మైనది గాదు. మఱియతని యుడుపులును నవ్వుపుట్టించునవిగ నుండెను. అయిన నతని జూచి యతనిమాటల వినిన వారందఱు నిట్టి యభిప్రాయ మెప్పుడును మనముల జొరనీరైరి. అతని స్వరూపమును, వస్త్రములును నతని నమ్రతకు సాక్షులని కొనియాడుచుందురు.

పతినిధి యుద్యోగపు బనుల జయము గాంచకున్నను నాబ్రహాము మిక్కిలి ప్రసిద్ధిమాత్రము వడసెదు. ముందు సమయము వచ్చినపుడు జయము గలుగు ననుట స్పష్టమాయెను.

ఈ పరిశ్రమ దీరినపిదప నాబ్రహాముబొక్కసమున నొక్క కాసైన లేకుండెను. న్యూసేలమున నతని కనేకులు స్నేహితు లుండిరి. గ్రీ నతని న్యాయపరీక్షకు జదువుమని కోరెను. అతడు దనకు యోగ్యత చాలదనియు, నావృత్తి యం దనృత మాడవలసి వచ్చుననియు, దా నాకార్యమును జేయ నెన్నటికిని సమ్మతింప ననియు, బలువిధముల నాస్నేహితునికి బదులుచెప్పుచువచ్చెను.

న్యాయవాదిగ నుండుటకు లింకనున కిష్టము లేకుండెను. ఆ వృత్తికి వలయు శక్తి దనకు జాలదని యతడు జంకుచుండును. గొప్పవారల కెంతటి నమ్రతయో గనుడి. తన్ను