పుట:Abraham Lincoln (Telugu).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లును స్మరణకు వచ్చుచున్నవి. 'హల్లు' గారు పట్టువడిన స్థలమునకు సమీపమున 'క్యాసు' గా రుండిరట. అదేరీతి నేనును స్టిల్లుమన్ పరాజితు డయినచోట లేకున్నను అతనికి సమీపముననె యుంటిని. కార్యమైనతరువాత నేనును అతనివలె గార్యరంగమును బొడగాంచితిని. నావద్దఖడ్గము లేనందున నది విఱిగిపొవునంతటి దెబ్బ తిననైతిని;అయినను నా తుపాకి వంకర పోవునంతటి తరుణ మొక్కటిమాత్రము సంప్రాప్త మాయెను.

"జనరల్ క్యాసుగారు నాకంటె ముందు గెనుసుగడ్డల నెదుర్చుచు నేగినది వాస్తపమే; అయిన నుల్లిగడ్డల బోరునందునే నతని మించితిని. అత డిందియనుల యుద్ధభటుల గాంచుట నాకంటె నెక్కుడు పనిసేయుటయ; అయిన నాపెంపు మఱొండు గలదు. నే నెన్నియో దోమలతో నుగ్రసంగ్రామ మొనర్చినాడను; నే నెప్పుడును రక్తనష్టమున సోలలేదు గాని పలుమా రాకలికి బడలినాడను. నే ని కిప్పుడైన డేమొ క్రాటిక్ పక్షము (అప్పటికి క్యాసుపక్షము) చేరి దేశాధ్యక్షతకు నిలిచినను నిట్టి యుద్ధవీరుడుగ మాత్రము నాపక్షపువారు వర్ణించి నా హక్కు స్థిరపఱుప జూడ కుందురుగాత."

ఈ యుద్ధమునకు వెడలుటకుముం దొకసంగతి జరిగెను. దాని గమనింపవలెను. న్యూసేలమున గ్రీనునకును మఱియొకనికిని ఆబ్రహాము బలమును గుఱించి వివాద మాయెను.