పుట:Abraham Lincoln (Telugu).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టుదలతో నేకాగ్రచిత్తమున దన మాట నడప నుపక్రమించిన యతని భయదాకృతికి వెఱచి వారెల్లరు సూటివెట్టిన గుండు బాఱనీక మఱలిపోయిరి. కొందఱు గొణగొణ యను కొనుచుండిరి. ఒకడు మాత్రము లింకనునకు "ఇది నీ పిఱికి తనమునకు దార్కాణ" మనెను.

త్రొక్కుడు వడిన భుజంగపతిలీల విజృంభించి లింకను "నే బిఱికి ననువాడవు నాతో బెనగి తెలిసికొందువుగాక. రమ్మ"ని కదనమునకు జేరెను.

అం దొకడు "నీవు మా యందఱకంటె దళమగు వాడవే" యనియెను.

భయ లేశమును దోపని ముఖకాంతితో "మీ యిష్టమునకు వచ్చిన యాయుధముల గొని పోరు డ" ని ప్రత్యుత్తర మొసగెను.

వా రిది విని భయకంపితు లయి మాఱు మాటాడక 'ఇందియను' నకు వే లైన జూపనోడి యూరకుండిరి. ఆమీద నెప్పుడును లింకనునకు బిఱికితన మారోపింప జూచిన వారు లేరు.

ఈ విషయమున లింకను ప్రాణము లపాయస్థితియం దుండెను. తన యుద్ధభటుల కూరకుండు డని యుత్తరువు సేసి యుండిన దిరుగబడి యుందురు. వారిని దండించుట యనిన