పుట:Abraham Lincoln (Telugu).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మించుటకు నూర్గురుపండితు లెడతెగక నూఱుసంవత్సరములు పరిశ్రమ చేసినను చాలు నని తోచదు. కాన దనశక్తికొలదిని తెలుగుభాస నభివృద్ధిచేయుటకు విద్యాగంథ మించుకయినను గల ప్రతియాంధ్రుడును బ్రయత్నింపవలయును. నాచేత నేమగు నని యధైర్య పడరాదు. ఇతరులను నిందించుటయే తనపనిగ బెట్టుకొనక భాషాసేవయే పరమోద్దేశముగ నెంచుకొని యేదో యొక విషయమును జక్కగ నభ్యసించి యందున గుఱించి గ్రంథము వ్రాసిన నది గ్రాహ్యంబే యగు; భాషాభివృద్ధికి సహకారియు నగు.

ఇట్లు తలచి 'యుడుతభక్తి' చందంబున మా యల్పశక్తికొలది నాంధ్రమాతృభాషాసేవ జేయ బ్రయత్నింపవలయు ననెడి యిచ్ఛ గల వార మయి 'విజ్ఞానచంద్రికామండలి' యను పేరిట నొక భాషాభివృద్ధి సంఘం బేర్పఱచినారము. ఈ 'మండలి' వారు 'విజ్ఞానచంద్రికాగ్రంథమాల' యను పేరిట గ్రంథంబుల బ్రచురించెదరు. జ్ఞానవిషయము లసంఖ్యంబులు గాన నన్నింటినిగుఱించిన గ్రంథంబులు నిర్మించుట యేరికిని సాధ్యంబు గాదు. కాన గొన్నివిషయములకు సంబంధించిన గ్రంథములనే వ్రాయదలచినారము. పద్యకావ్యములు, నాటకములు, కల్పితకథలు, భాషా (Language) విషయిక చర్చలు, వాజ్మయ (Literature) విషయిక చర్చలు భాషాభివృద్ధికి నత్యంతావశ్యకంబు లయినను ఈవిషయిక గ్రంథములు మేము ప్రస్తుతము వ్రాయను, వ్రాయించను దలచుకొనలేదు. 1. దేశచరిత్ర (History), 2. వ్యక్తిచరిత్ర (Biography), 3. ప్రకృతి లేక భౌతికశాస్త్రములు (Physical Sciences), 4. [Mill's Liberty, Subjection Of Women, Spencer's Education, Smile's Self help, Character, Thrift, Duty, Lubbock's Pleasures Of Life] మొదలైన యింగ్లీషులోని సర్వోపయోగకరములగు గ్రంథంబుల భాషాంతరీకరణము, ఈ నాల్గు విషయములను గుఱించినగ్రంథంబులు మాత్రము ప్రచురింప దలచినారము.