పుట:Abraham Lincoln (Telugu).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొప్పవారి కితరులు సేయు మర్యాద లెల్లపుడు నమ్రత వుట్టించి ఘనతర కార్యముల జేయ నుత్సాహము గలుగ జేయును. ఒకరు మనయెడల గారవము సూపిన మన మింతవార మైతిమిని విఱ్ఱవీగుట మాని యీ గారవమునకు దగు నర్హత మనకు గలదే యని తర్కించి యట్టియర్హత సంపాదింప బాటుపడుట గదా సుజనుని లక్షణము.

లింకను దననయప్రవర్తనచేత గలుపుగోలుదనముచేత, సుస్వభావము చేత, నెల్లర యుల్లముల రంజిల్ల జేయుచుండును. అతని సత్ప్రవర్తనకు బట్టణవాసులెల్ల సంతసింపుచుందురు.

ఒకనాడు డంకను సతికి రెండున్నఱ డాలరుల వస్తువుల నమ్మెను. సాయంకాలము లెక్కజూచుకొన నామె యఱడాల రెక్కు డిచ్చినట్లు తేలెను. వెంటనే యంగడి రాత్రికి మూసివేసి తలుపుబిగించి యఱడాలరు చేతగొని రెండుమైళ్లు నడచిపోయి దాని నాపె కిచ్చి యిలుసేరి సుఖనిద్రవోయెను.

మఱియొకనా డొక యబల సంధ్యాకాలమున బ్రొద్దు గడచినతరువాత నంగడి మూయుసమయమున వచ్చి యఱపౌను తేయాకిమ్మని యడిగెను. వెలపుచ్చుకొని తేయాకిచ్చిన వాలుము బంధించుకొని లింకనింటికి బోయెను. మఱునా డుదయమున వచ్చినతోడనె తక్కెడయందు కాలుపౌను రాయి యుండ గాంచి రాత్రి యాస్త్రీకి గాలుపౌను దక్కువ యిచ్చుట గుర్తించి