పుట:Abraham Lincoln (Telugu).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుపాత్రలు, మట్టిపాత్రలు, పింగాణిపాత్రలు, కాపీ విత్తులు, తేయాకు, పంచదార, కత్తులు, గుండీలు, కత్తెరలు, పలువిధములగు పాదరక్షలు, పొగాకు, వెన్న, తుపాకిమందు, ఇవి మొదలుగా గల యనేకవస్తువు లాయాస్థలమున గంటి కింపగువిధమున నిలుపబడెను. కొద్దికాలములోనే క్రొత్త సామానులు గ్రొత్తగిడ్డంగిదారుడును లోకులకన్నుల కానంద మొనర్ప దొడగెను. లింకను మర్యాదచేష్టలును, అతని జనప్రియత్వమును నంగడి కనేకుల నాకర్షింప మొదలిడెను.

ఆపు ట్టితరకార్యముల దగిలి న్యూసేలమున నుండలే కుండెను. కావున నచ్చటి తిరుగలియంత్రపు బై విచారణయు నంగడియందలి సర్వాధికారమును లింకను కప్పగించి విల్లియం గ్రీను అనువాని నతనికి సాయ మిచ్చెను.

ఆపుట్టు పలుమాటలవాడు లింకనును బొగడుటయందతనికి దనివియే లేదు. ఒక్కొకమాఱు "యునైటెడ్‌రాష్ట్రమున నుండినవారలలో జ్ఞానసంపత్తికి లింక నగ్రగణ్యు డ"నును. ఒక్కొకమారు "నే జెప్పునది జ్ఞాపక ముంచుకొనుడు. లింక నికముందు దేశాధ్యక్షత వహింప గలడ"నును. ఇట్టి సంకీర్తనములచేతను రట్లడ్జి యానకట్టమీద జూపిన బుద్ధి కౌశల్యము చేతను లింకననిన నాగ్రామమున గొప్ప మర్యాదతో జూచుచుండిరి.