పుట:Abraham Lincoln (Telugu).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టి యొకబండిలో వైచికొనిపోయి యొకదానితరువాత నొకదాని నెత్తిపడవలో నుంచెను. ఇదంతయు గ్రౌర్యమే యై గను పట్టినను బందులతో బెనగునెడ వానికి దగువిధముననే నడవ వలయునుగదాయని యాబ్రహాము సమాధానపఱచుకొనెను.

అటనుండి తఱలునపుడు పడవ వేగము హెచ్చుచేయుట కతడు పలకలతోను ముతకగుడ్డతోను ఒకవిధమగు నోడ చాపల నేర్పఱచెను. చూచువారల కది వింత యై నవ్వు పుట్టించినను శీఘ్రయానమునకు గడు తోడ్పడెను.

మేనెల యగునప్పటికి న్యూఆర్లియన్సు చేరిరి. అచ్చటన బానిస లనుభవించుకష్టముల నాబ్రహాము సూచినది. సంకెళ్లతో బంధించి కొరడాదెబ్బల దీయుచు జూచువారల మనమున నాగ్రహఖేదముల బుట్టించుచు నీగ్రోల దోలుకొనిపోవుట ప్రథమమున లింకను కంటబడి హృదయమునకు శరవేగమున దిగి నాటుకొనిన దచ్చటయ.

డైవ మేరికి దెలియనివిధముల బాటుపడుచుండును గాదే! ఆబ్రహాము నిటకు దెచ్చి యీ ఘోరకృత్యముల గనజేసి వాని నట్లె యడంప బ్రయత్నములు సేయ నుత్సుక మొసంగిన యాకరుణాంభోనిధి మహిమ గొనియాడ దరంబె?

జూన్‌నెలలో నాపుట్టును అతని ముగ్గురు పనివారును గృహోన్ముఖు లైరి. యజమానుడు దా మందఱు స్టీమరు