పుట:Abraham Lincoln (Telugu).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడవియందలి చెట్లనఱకి దూలములు మొదలగు నుపకరణముల నాతత్తము చేసికొని నాలువారములలో నాబ్రహామును అతని స్నేహితులును బడవ సిద్ధముచేసిరి. ఆ పుట్టు వారితో నడవియందు గొన్నిదినములుండి వారు చేయుపనుల జూచుచుండెను. అప్పుడతనికి నాబ్రహాము సామర్థ్య మెఱుంగ వీలుగల్గెను. రుచ్యముగ భోజనము వండిపెట్టుట మొదలు, ఉపన్యాసము లిచ్చుచు రాజకీయవిషయముల చర్చించి సిద్ధాంతములు చేయుటవఱకు ననన్యసామాన్యశక్తి యాబ్రహామునందు గాన నగుచుండెను.

పడవ సిద్ధమైనవెంటనే దానిపై బరువులనెత్తి యది క్రిందివైపునకు నడప బ్రారంభించిరి. అచటనచట వ్యాపారము సేసికొనుటకై యాపుట్టును ఆపడవతో జనెను. న్యూసేలము పట్టణము దాటి జనినతరువాత రట్లడ్జి యానకట్టతాకి యా పడవ వెనుకటిభాగము నీటిలోనికి దిగెను. ముందఱిభాగము మాత్రము కట్టపై లేచియుండెను. ఇట్లొక్కరాత్రియంతయు నుండ కొంత పగలుగూడ గడచెను.

సరకులు వెనుకకు జరగుచుండెను. తీరమున జనులు గుంపులుచేరి "జాగ్రత పడుడి. లేకున్న మీ పడవ నడిమికి విఱిగినను విఱుగు నీట మునిగినను మునుగు" నని కేక లిడుచుండిరి. ఆపుట్టు కలత జెంది యీ యాపద దప్పించుకొను