పుట:Abraham Lincoln (Telugu).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మై చర్చ జరుగుచుండెను. అచ్చటిన్యాయవాదులలో నగ్రగణ్యు డగునతడు మిక్కిలిసమర్థతతో నుపన్యసించుచుండెను. దానిం గని తా నెన్న డట్టి వక్త యగుదునను చింత యతని బాధించెను. సొంపుగుల్కుమాటలకు మిక్కిలి యలరి తన దీనస్థితిని మఱచి యాన్యాయవాది వెడలునెడ నతని జేరి "నే వినినయుపన్యాసములలో మీది యుత్తమ" మనియెను. ఈ మోటుబాలుని జూచి విస్మయమంది యతడు మాఱు మాటాడక తనత్రోవన బోయెను.

ఇంటికి మరలివచ్చి వాగ్ధోరణి యనర్గళముగ వృద్ధిచేసి కొన నెంచి యాబ్రహాము సభల నేర్పఱచి యట సంభాషించుట, యుపన్యసించుట, చర్చించుట మొదలగుపనులకు బూనెను. ఆప్రాంతముల బసివా రంద ఱికార్యముల శ్రద్ధ జేయ నారంభించిరి. అనేకు లతని చుట్టు జేరి యతడు వక్కాణించునదంతయు నేకాగ్రచిత్తులై వినుచుందురు. అతని చమత్కారమునకు మెచ్చి యాబాలవృద్ధు లెప్పుడతని వాక్యామృతవర్షంబునకు జంద్రకిరణములకు జాత కపోతంబులువోలె వేచియుందురు. ఈ సందర్భముల నాబికి దా కంఠోక్తిగ నేర్చినవిషయము లన్నియు నుపయోగకారు లాయెను.

అతడు చర్చించుచు వచ్చిన విషయముల నొకటి "నీగ్రోల బెక్కు డన్యాయము జరుగుచున్నదా? ఇందియనులకా?"