పుట:Abraham Lincoln (Telugu).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోడపు బని కెచటనైన నియమింపవలసినదని వేడెను. "నీ తండ్రిగారి కీవు సాయ మొనర్పక యిట్లువెడలుట తగునే" యనిన "నే నీవిధమున యతని కెక్కుడు సహకారిగా గల్గుదు" నని ప్రత్యుత్తర మొసగెను. అయిన ను డ్డావిషయమున శ్రద్ధ తీసికొన నంగీకరింపనందున నాబ్రహా మింటికి దరలెను.

స్తన్యరోగము దాడికి నిలువలేక యనేకులు "ఇల్లినాయి" సీమకు జనియుండిరి. థామసుగూడ నీప్రకార మొనరింతమా యని యోచించుచుండెను.

మధ్యకాలమున నాబ్రహాము 'ఇందియానా చట్టదిట్టము' ల నొక స్నేహితు నింట గని యతడు సదువని వేళల దా జదువుకొనియెను. చట్టదిట్టముల జదువు టందఱ కానంద దాయిగాదు. క్రొత్త యూహల బుట్టించి నూతనచర్చల కెడమిచ్చినందున నవి యాబికి మిక్కిలి రుచ్యము లయ్యెను. భావికాలమున నవి యతని కెంత తోడ్పడినది మన కెఱుక పడగలదు. తాత్కాలిక ఫలమొం డిచట వివరింతము.

ఆబికి న్యాయస్థానమున నేమిసేయుదురో వ్యాజ్యము లేలాగు విచారింతురో చూడవలె ననుయభిలాష పొడమెను. బూన్విల్లను గ్రామమునకు బదునైదుమైళ్లు నడిచి న్యాయస్థాము సేరెను. అచ్చటి విచిత్రవిధు లతని నాకర్షించి పలుమాఱచటికి బో జేసెను. ఒకానొకతఱి ఒక "హత్య" విషయ