పుట:Abraham Lincoln (Telugu).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము

కొన్ని విషయములు, ఇల్లినాయి సేరుట.

ఆబ్రహాము దనంతకు దా బనిచేసికొని బ్రతుక బ్రయత్నములు సేయదోడగెను. అదివఱ కత డొకపడవ నిర్మించుకొని దాని నడుపుచు గొంతధనము సంపాదించినట్లు నిదర్శనము లున్నవి. ఒకతఱి తన పడవ చక్కబఱచుకొన జూచుచుండెనట. అప్పు డిద్దఱు ప్రయాణీకు లేతెంచి తమ్ము బొగయోడ జేర్పవలసిన దని యతని నేమించికొనిరట. వారి సామగ్రి యంతయు నెక్కించుకొని యాబి నిర్ణీతస్థలము సేరి వారి పెట్టెల నెత్తి పొగయోడపై నిడి తన పడవ చేరి కూలికాసుల కై వేచి యుండెనట. అంత వారు తలా యొక యరడాలరు (అనగా మన ర్పు 1-4-0) అతనిచేత వేసిరట. దాని కత డొందిన సంతసమునకు మేరయే లేకపోయెనట.

ఈవిషయము దా దేశాధ్యక్షతకు వచ్చినతరువాత జెప్పుకొని 'యీవిధమున నే మొదటిడాలరు గడించితిని. అప్పటి కదియ మహా నిధానము గనినతెఱంగున నుండె'నని చెప్పుచుండును.

న్యూఆర్లియన్సు యాత్ర ముగిసినతరువాత నతడు సంపాదనపరుడై కుతూహలమున నుడ్డుగారిని జేరి తన్ను