పుట:Abraham Lincoln (Telugu).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీవ నాకసము చిల్లివడి కడవల గ్రుమ్మరించినతెఱగునను, ప్రతివస్తువును నాధారల సముద్రు జేర్తునని వరుణుడు మూర్తీభవించెనో యనునటులను వర్షము గురియుచుండును. అట్టిరాత్రుల నా 'నావికులు' పరుండ వారికి మఱొండు శరణు లేదు. తమ తెప్పపై జడివాన తాకుడుకు నడలక పడకచేసికొని పడియుందురు. వారి ధైర్యోత్సాహముల బరిశీలింప దైవమున కిట్టివియ యుక్త మగుసమయములు. వారును దమ స్థితి గతుల గుఱించి యెప్పుడును వగచినది లేదు. ఎట్టి యిక్కట్టులు వాటిల్లినపుడును నీ ప్రయాణమున కియ్యకొనకున్న బాగుండునని యాబ్రహాము దలచినది లేదు. అతని మన మాకార్యమున నంత మగ్న మయి యుండెను.

ఇట్లు పరిపూర్ణహృదయమున యాత్రనడపుచు నొక దినము సాయంకాలమున నాతెప్ప గట్టున కీడ్చి బంధించి దాని ముందరిభాగమున బడి నిదురపోవుచుండిరి. అర్థరాత్రమున నడుగుల చప్పుడు వారిని మేలుకొల్పెను. ఆబ్రహాము గొంచెము చెవియొగ్గి విని యిది మోసమైనకృత్య మగునని యాలెనునకు గుసగుసధ్వనితో జెప్పెను.

దొంగల బెదరింప సమకట్టి. యాలెను గంభీరస్వనమున "ఆబి తుపాకుల దెమ్ము వారి బరిమార్చు"మని యఱ