పుట:Abraham Lincoln (Telugu).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రులు పడవను గట్టున కీడ్చి పదిలముగ గట్టియుంచి పరుపుల కాశింపక దానిపైబడి కంబళుల గప్పుకొని నిదుర పోవుచుందురు. అడవులలో బెరిగినవారి కివియెల్లయు నంత విశేషమార్పులు గాకున్నను గొంతమార్పు లైన నగును గాదే. కొన్ని రాత్రులయందు వా రొంటిగ బరుండుట చూచిన నేరికి వారిపై జాలి గల్గదు?

వారి ప్రయాణ మసహ్యముగా నుండ దయ్యెను. దృగ్గోచరప్రదేశ మప్పటప్పటికి మాఱుచుండుటవలన గ్రొత్తక్రొత్తల తావితానముల, వృక్షసమూహముల, జంతుజాలముల, బ్రకృతివిచిత్రముల బొడసూపి యానందము గలుగ జేయుచుండెను. పలుమాఱు నది దిగివచ్చు 'పడవలు'ను వానియందలి నావిక సమూహములును నెదురుపడుచుండెను. ఆ యేటియొడ్డున నుండు గ్రామజనులు గుంపులుగుంపులుగ వచ్చి సంభాషణచే సంతృప్తి సేయుచుండిరి.

ఎల్లకాల మొక్కరీతిగా నుండదుగదా! గాలివాన లత్యుగ్రముగ నప్పుడప్పుడు పై గ్రమ్ముచుండును. అట్టి సమయముల దమ తెప్ప పల్లటిలకుండ నుంచుకొనుటకు వారి శక్తి యంతయు నుపయోగించి పాటుపడుచుందురు. దినదినమును వానలో దడిసి ప్రయాణము చేయవలసి యుండును, ఒక్కొక పర్యాయము రాత్రులు విపరీతముగ ఝంఝూమారుతము