పుట:Abraham Lincoln (Telugu).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవుచుందురు. రాత్రి యనక, పగు లనక, చలి యనక, గాలి యనక, యెండ యనక నీడ యనక ప్రయాణము సేయుచు నా కాంతారంబుల శత్రువు లెదిర్చిన వారితో, బోరుచు బ్రాణముల కాశింపక పనిసేయుచుండుట యప్పటినావికుల కతిసామాన్యము. ధైర్యసాహసంబులు వారియంద మూర్తీభవించినట్లుండుట యత్యావశ్యకము. ఇట్టి పడవల మిసిసిప్పి నదిపై కెక్కు సరకులన్నియు బంపబడుచుండును. కొన్ని సమయముల దగినంత సామగ్రి యున్న గొప్పగొప్ప సాహుకారులు దామ యిట్టి వ్యాపారయాత్రలకు వెడలుచుందురు.

1828 వ సంవత్సరమున నాబ్రహాము జెంట్రి యను సాహుకారికి సేవకుడుగ జేరెను. అచ్చటను నాబి సర్వకార్యములు నిర్వహించుచు దనదొరచే మెప్పువడసెను. అతని కాలె నను కుమారుడు గలడు. ఆ బాలుడును నాబియు గలిసి పనిసేయుచుందురు. జెంట్రి యాబ్రహాముగార్యనిర్వాహకత్వమున దక్షత గలవా డని నమ్మి యతని దన గుమారుతో న్యూఆర్లియన్సు నగరమునకు సరకిచ్చి పంప నిశ్చయించుకొనెను. తండ్రి యాజ్ఞ యైన దా వెడలుటకు సిద్ధముగా నున్నాడ నని యాబ్రహాము వచించెను. లింకనులు జీతము విషయము నిర్ధారణ సేసికొని యా ప్రయాణమునకు నాబిని సిద్ధము గమ్మనిరి. పదమూడు వందల మైళ్లు కష్టములకోర్చి