పుట:Abraham Lincoln (Telugu).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహు సమర్థుడు. తనతో నాడువారల నెల్లర సునాయాసముగ నోడించుచుండెను.

తొమ్మిదవ ప్రకరణము

తెప్పపై బ్రయాణము.

ఆకాలమున నమెరికాయందు బొగబండ్లుగాని, మంచి రాదారులుగాని లేవు. దట్టమగు నడవులచే నిండి చోరభయము గలిగించుచుండు ప్రదేశము లనేకము లుండెనని యిదివఱకే చెప్పబడియెను. నదులు దేశములకు మహోపకారులు. మఱి యేబాటలును లేనితరుణమున నివి రాకపోకల కుపకరణములుగ నుపయోగించుకొనబడుచు వచ్చుచున్నవి. పెద్దపెద్ద నదులపై నుండుపట్టణముల వ్యాపారము మెండుగ నుండుట పలుమాఱు తటస్థించుచున్నది. అమెరికాయందు నిట్టి పట్టణములు గొన్ని యప్పుడప్పుడ వృద్ధిజెందుచుండెను. అయిన నీటిమార్గమున వాని జేరుటకు దగిన సులభసాధనము లప్పుడు లేవు. ఇప్పటి నావికుల యదృష్ట మప్పటివారి కుండదాయెను. పడవ నిర్మించుట యనిన నాలుగు మొద్దు లొక్కటిగ గట్టుట. వీనిపై సరకుల నెక్కించుకొని ప్రవాహమున కెదురు బోవలసి యున్న దాళ్లచే మనుష్యుల నీడ్చికొని