పుట:Abraham Lincoln (Telugu).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. పురుషకారంబు దానెంత పొరవడినను
   దేవు డెప్పుడు దగురీతి దీర్చుచుండు.

ఈ రాజకీయోపన్యాసమునుగూడ నుడ్డుగారు పత్రిక యందు బ్రచురింపించుటకు బ్రయిత్నములు సేసిరి. ప్రిచ్చర్డను నొక న్యాయవాది యా దారిని బోవుచుండ నతని కా లిఖితవిషయము సూపిరి. అతడు దాని జదివి యుడ్డుగారిదేమో యని సందేహించి యాబిసృష్టి యని విని మనమున నలరి తమ పక్షపు బత్రికయందు ముద్రింపించుట కియ్యకొనెను. కొన్నిరోజులలో నా యుపన్యాసము పత్రికయందు జేరి యుడ్డుగారికి సంతృప్తియు, నాబికి సంతోషమును, ఇరుగు పొరుగువారల కానందమును గలిగించెను.

ఆబ్రహామున కాటలయం దభిరుచి బహుమెండు. వాక్చాతుర్యమున జనరంజకత్వము నొప్పు నత డవ్వానియందు మిక్కిలి పేరు వడసెను. అతను లేనియాటలన్నియు మంగళ సూత్రములులేని కన్యాదానములవలె నుండును. పదునెనిమిది సంవత్సరములవా డైనదాదిగ నతని కాయపుష్టి పేరొందిన దాయెను. రూపునందేగాక బలమునందుగూడ రాక్షసుని బోలియుండును. ముగ్గురుమనుష్యులు సాధారణముగ మోయ గల్గు బరువు నత డవలీలగ నెత్తివైచుచుండును. మల్లయుద్ధ మప్పటికాలమున గడుప్రియ మగు నాట. దానియందు నాబి