పుట:Abraham Lincoln (Telugu).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"బుద్ధి కుశలు లగు జనులకు నమెరికా ప్రభుత్వమే (అనగా ప్రజాప్రతినిధులచే బరిపాలన) తగును. ఇదిచక్కగ బ్రబలి యెల్లకాల ముండు గాత. దేశ మంతటను విద్యాదీపము వెలుగజేయుట గర్తవ్యము. రాజ్య నిబంధనలు గాపాడ బడవలసినది. రాజ్యైక్యము వృద్ధి చేయవలసినది చట్ట దిట్టములు చక్కగ బ్రయోగింప బడవలసినది. జనులవ్వాని గౌరవింపవలసినది."

ఉడ్డుగా రీ యుపన్యాసము జదివి మునుపటికంటె నెక్కుడు సంతృప్తి జెందిరి. ఎక్కు డాశ్చర్యాద్భుతములకును నిది యెడ మిచ్చెను. ఇప్పు డీ విషయమును బరిశీలించు మన యుపన్యాసము నూతనానందము గలుగజేయుచున్నది. ఆబ్రహాము దేశాధ్యక్షత వహించునెడ మొదటి యుపన్యాసమున నీవిషయములే నుడివి వాని నెల్ల దా నెరవేర్ప బ్రారంభించెను. అడవుల నిడుమల బడుచుండు బాలుడగు నీయుపన్యాసపు గర్త ముప్పదిమూడు సంవత్సరముల మీదట దేశాధ్యక్షత వహించి రాజ్యైక్యపు శత్రువులు రాజ్యనిబంధనల దుడిచివేసి, యైక్యము బోదోలి, చట్టదిట్టముల మట్టి గలుప జూచు చుండ దన ప్రథమోపన్యాసమున వారికి వ్యతిరిక్తముగ డా భాల్యమున వ్రాసిన విషయములె నుడువుటెంత చిత్రము ఆహా ఏమివింత