పుట:Abraham Lincoln (Telugu).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార్తాపత్రికల దెప్పించుచుండెను. అందొకటి మత్తుపదార్థముల ఖండన నిమిత్త మేర్పడినది. రెండవది రాజకీయ వ్యవహారములగుఱించినది నై యుండెను. రెండవదానికంటె నాబ్రహామునకు మొదటిదానియం దెక్కుడు గౌరవము. దాని జదివిచదివి తుట్టతుద కీ విషయమున మునిగిపోయి తా నొక పెద్ద యుపన్యాసమువ్రాసి యుడ్డుచేతి కిచ్చెను. అత డద్దాని జదివి పట్టరాని సంతోషమున నితరులకు జూపి యాబాలకు బొగడి దాని వార్తాపత్రికయందు బ్రచురింపించి యిరుగుపొరుగువా రందఱకు జదువ నంపెను. చదివినవారెల్ల నాపత్రిక యందలివిషయ మత్యుత్తమముగా వ్రాయబడినదని యెంచి, దాని వ్రాసిన యాబ్రహాముశక్తికి మెచ్చిరి. ఉడ్డుగా రతని జూచి "రాజకీయోపన్యాస మొండు వ్రాయ గల్గుదువే?" యనియె. "నే నిదివఱకు గొన్ని వాక్యములు వ్రాసి యుంచితిని. గొప్ప యుపన్యాసము వ్రాయ నైతిని. ఇప్పుడు ప్రయత్నించెద గాక," యని యాబ్రహాము ప్రత్యుత్తర మొసగి విషయ మేదియైన బాగుండు నని యడిగెను. ఉడ్డుగా రొక కొన్ని యంశంబుల సూచించిరి. ఒక్కవారము గడవకముందె యాబ్రహా ముపన్యాస మతని కందెను. ఏమి వ్రాసినదియు నతనికి సంపూర్ణముగ జ్ఞాపకము లేకున్నను దాని ముఖ్యాంశము లివియని చెప్పియున్నాడు: