పుట:Abraham Lincoln (Telugu).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలవాటు. అతని మాటలు కేకలకు సమముగా నుండును; స్వనము పగిలి ముక్కుగుండ వచ్చిన ట్లుండును. ఈ వైపరీత్యములెల్ల జిన్నవారలకు హాస్యాస్పదము లయ్యె. ఆబ్రహా మవ్వాని నట్లె ప్రదర్శింప దొడగె. కొందఱు వయసుదీరిన వారు మతాచార్యుల నట్లవమానపఱచుట తగదని ఖండించినను వారుగూడ నాబ్రహాము ప్రతికల్పన గనినపుడు ప్రక్క లెగయ నవ్వుచుందురు. థామసునకుమాత్ర మిది మిక్కిలి దుర్భర మాయెను. తనకొమరుడు పలుమా ఱీవిధమున నితరుల బరిహసించుట కత డోర్వక పనిచెడునని తలంచి యిట్టి నడవడి మాని వేయవలసినదని యాబి కాజ్ఞ యొసగెను.

అయిన గొడుకు బుద్ధికుశలతకును, ఉపన్యాస శక్తికిని థామసు మనసున బహుసంతోషము నొందె ననుటకు సందియము లేదు. అతడు సంతసించినను సంతసింపకున్నను ఆబ్రహాము మాత్రము దన పురోభివృద్ధికి నవశ్యంబులయిన సాధనంబుల సేకరించెను. రాజకీయోద్యోగముల బ్రాముఖ్యత దెచ్చు సాధనముల గడించుట కీ యభ్యాసమునకంటె శ్రేష్ఠమైనది వేరొకటి లేదుగదా.

లింకనుల గుడిసెకు మైలున్నర దూరమున నివసించుచుండు నుడ్దను నతనివద్ద పలుమారు పనిసేయుట కాబ్రహాము నిండుమనమున బోవుచుండును. ఆ యజమానుడు రెండు