పుట:Abraham Lincoln (Telugu).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా యని వేచియుండి చిక్కిననిమిషమును విడువక యుపయోగించుకొనుచు దండ్రిపనుపు లంత శీఘ్రముగ జేయకుంట దండ్రి కంత సమ్మతముగా నుండదాయెను. అయిన నింతకంటె గొప్ప యాగ్రహకారణము మఱొం డుండెను. రాజకీయోపన్యాసములకును మతవిషయిక చర్చలకును నాబి పేరువడసెను. ఎచట నొక మొద్దు పడియుండిన దాని పై నెక్కి యుపన్యసించుట యతనికి సర్వసాధారణము. ప్రతి యాదివారమును సాయంకాలమున బురోహితులు నుడువునదెల్ల దా జక్కగ వినిచుండును. దానిని దన మనోపేటిక జేర్చి సంపూర్ణముగ జ్ఞాపక ముంచుకొని మఱునాడు పెద్ద మొద్దు నెక్కి కథనముసేయ మొద లిడును. అత డెప్పు డుపన్యసించుటకు బ్రారంబించునో యప్పడ చుట్టుప్రక్కలవా రందఱు దమ పనుల వదలుకొని విన వచ్చుచుందురు. ఏ పురోహితు డేమాటలతో నేవిధమున నేస్వనమున నాబ్రహాము నుడువు నామాటలతో నావిధమున నాస్వనమున నాబ్రహాము వినువారల వీనుల విందుసేయును. ఇట్టినడత పనుల కడ్డమువచ్చుటబట్టి థామసు కుమారుని గోపగించుచుండును. అయిన నిట్లు చేయగూడదని గట్టిగ నుత్తరువు సేయడాయెను. కొన్నిదినములమీద నాప్రాంతముల కొకయాచార్యుడు వింతవా డేతెంచెను. అత డుపన్యసించునపుడు బల్ల బద్ద లగునట్లు పిడికిటితో గొట్టు టతని