పుట:Abraham Lincoln (Telugu).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. మంటవేసి రాత్రియంతయు నాయదృష్టహీనునకు బరిచర్య లొనర్చుచు నాబియు నాతని స్నేహితుడును గడపిరి.

మఱునా డుదయమున మేల్కాంచి యా త్రాగుబోతెంత సంతసించి యుండునో మన మెఱుంగజాలము.

ఎనిమిదవ ప్రకరణము

ప్రవృద్ధి, ప్రకాశములు.

ఆబ్రహా మెప్పుడును దల్లి కెదురు సెప్పి యెఱుగడు. ఆ యమ చెప్పిన పనియంతయు జేయుచుండెను. తల్లికూడ నతని మాటయనిన మిక్కిలి యాదరించుచుండు. అతడు పరలోకప్రాప్తి జెందినతరువాత నంత గుణవంతు బుత్రు దా నెన్నడు జూడలేదని నుడువుచు నాపె పలుమాఱు విలపించుచుండును. దేశాధ్యక్షత కాత డియ్యకొనునపుడు దనమన మెట్లో భయ మందెననియు, నతని కా పదవి రాకున్న మేలగునని దా దలచుచుండుననియు జెప్పి పుత్రరత్నము గోలుపోయి బ్రతుకుటకంటె దన ధవునకు బూర్వమె దానేల భూలోకము విడువకుంటి నని దు:ఖించుచుండును.

తండ్రిమాత్ర మాబ్రహాము పై గొంచె మాగ్రహము గనుబఱచుచుండును. విద్య గడించుటకు గాలము దొఱకు