పుట:Abraham Lincoln (Telugu).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డును. వీనినన్నిటి నాబ్రహాము జక్కగ జదువ దొడగెను. రాజకీయ వ్యవహారముల జ్ఞానము సంపాదించుకొనుట కిదె యాబికి బ్రథమప్రయత్నము.

జోన్సు యాజమాన్యము దప్పిపోయినపిదపగూడ నాబ్రహాము స్నేహితులతో నాతని కొట్టునకు విచ్చేసి రాజకీయ వ్యవహారముల గుఱించి చర్చించుచుండుట సాధారణముగ నుండెను.

ఈ చర్చల నొకరాత్రి ముగించి స్నేహితులు దానును నిండ్ల కేగుచుండిరి. మంచు విశేషముగ గుఱియుచుండెను. చలికి నిలువలేక జంతుసంతానమెల్ల నెక్కడి వక్కడ ముడిగికొని పోయియుండెను. చీకటు లల్లనల్లన దట్ట మగుచుండెను. అట్టి సమయము నాదారియం దొక శరీరము గదలమెదల లేక పడియుండెను. పరిశీలింప నాప్రాంతమున నుండు నొక త్రాగుబోతు దప్పద్రాగి మై మఱచి నేల గూలుయుండుట గాంచిరి. తన మిత్రు లెల్లరు నట్టివాని కిట్టి శిక్షయె దగునని నుడువుచు దమతమ నెలవులకు జనిరి. అబిమాత్రము వానిపై జాలిగొని బలశాలి గావున జేతులపై వాని నెత్తుకొని పోయి సమీపము నుండు నొకమిత్రుని కుటీరమున జేర్చెను. వాడును మొదట నుపేక్ష సేయబూని యాబ్రహా ముపన్యసింప జ్ఞానము దెచ్చికొని యతనికి సాయ మొనర్చు