పుట:Abraham Lincoln (Telugu).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్ణితమాసములు దొమ్మిది చనగానే యాబ్రహా మిల్లుచేరెను. అతని సోదరి పాణిగ్రహణ మహోత్సవ మప్పుడ యాలింకనుల కుటీరమున యధావిధిగ జరిగెను. తదర్థ మాబి కొన్నిపద్యములువ్రాసి యతిథులకెల్ల హర్షము గలుగజేసెను. నాప్రాంతముల నత డుచక్క మఱి యెవ్వరు నిట్టిసమయముల గ్రంథస్థితవిషయముల కథనముచేసియు, నూతనముగ గల్పించియు వాక్చాతుర్యమున గవననైపుణిని గనుబఱచి విను వారల బ్రక్కలెగయ నవ్వ జెనకు సమర్థులు లేనందున నతడిట్టి సంతససమయముల ముఖ్యుడుగ గణింపబడుచుండెను.


ఈ వివాహానంతర మొకసంవత్సరమునకు సారా పరలోక ప్రాప్తి నొందెను. సోదరిని మిక్కిలి ప్రేమించుచుండె గాన నిది యాబ్రహాము హృదయమున గొంతకాలము చింతాక్రాంతమున జేసెను.

కొద్దికాలమునకు దరువాత నాబ్రహాము మఱియొక వ్యాపారి జోన్సుదగ్గఱ బనికి గుదిరెను. ఆయజమాను డితని యద్భుతశక్తి కలరువాడు గాన నితని దన విశ్వాసార్హునిగ జేకొనియెను. అతనికొట్టు లింకనుల కుటీరముల కొకటిన్నర మైళ్లుదూరమున నుండెను. అం దాబ్రహామునకు ఫ్రాన్‌క్లిన్ జీవితము మొదలగు గొన్ని పుస్తుకములు దొరకెను. వార్తా పత్రిక గూడ నా యజమాను డొకదానిం దెప్పించుచుం