పుట:Abhinaya darpanamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినియోగము—:

చన్దనే భుజగే మందే ప్రోక్షణే పోషణాదిషు,
దేవర్షుదకదానేషుహ్యా౽౽స్ఫాలే గజకుమ్భయోః.

328


భుజాస్ఫాలే తు మల్లానాం యుజ్యతే సర్పశీర్షకః,

తా. గందము, పాము, మెల్లగాననుట, నీళ్ళు చిలుకరించుట, ప్రోచుట మొదలగునవి, దేవర్షి తర్పణములు, ఏనుఁగు కుంభస్థలములను చరచుట, జెట్టిలు భుజము చరచుట వీనియందు ఈహస్తము ఉపయోగపడును.

గ్రంథాంతరస్థసర్వశీర్షహస్తలక్షణమ్

పతాకే నిమ్నమధ్యత్వం సర్పశీర్ష ఇతిస్మృతః.

329


నిరీక్ష్యనిర్జరాన్భీతాన్కరవిన్యాసపూర్వకమ్,
బలింవఞ్చయితుంఖర్వో భవేయమితిభాషతః.

330


వామనాత్సర్పశీర్షో౽యం వాసవో ఋషిరుచ్యతే,
హరిద్వర్ణో దేవజాతిః కాలకంఠో౽ధిదేవతా.

331

తా. పతాకహస్తమునందలి అరచేయి పల్లముగా పట్టఁబడునేని సర్పశీర్షహస్త మగును. పూర్వకాలమునందు బలిచక్రవర్తికి వెరచి తన్ను శరణుచొచ్చిన దేవతలనుగూర్చి విష్ణుదేవుఁడు 'వామనావతార మెత్తి బలిని వంచించి మిమ్ము కాపాడెద' నని చేయి చాఁచి చెప్పునపుడు ఆవామనునివలన ఈసర్పశీర్షహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఇంద్రుఁడు ఋషి. పసుపు వర్ణము. శివుఁడు అధిదేవత.

వినియోగము:—

కుఙ్కుమే పఙ్కభావే౽పి ప్రాణాయామనిరూపణే,
ముఖప్రక్షాళనవిధౌ దానవేళావివేచనే.

332